
సింహ వాహనంపై కూష్మాండదుర్గ
మహానంది: మహానందిలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీకామేశ్వరిదేవి కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అలంకార మండపంలో ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, రుత్వికులు ముందుగా అమ్మవారికి విశేష అలంకార పూజలు, సహస్రదీపాలంకరణ పూజలు చేపట్టారు. బలిహరణ, కూష్మాండబలి పూజల అనంతరం అమ్మవారిని సింహవాహనంపై కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఉత్సవం చేపట్టగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమాల్లో ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్‌రెడ్డి, నీలకంఠేశ్వరరాజు, పి.సుబ్బారెడ్డి, ఇన్‌స్పెక్టర్ నాగమల్లయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

సింహ వాహనంపై కూష్మాండదుర్గ