
ఆదోని ఎంపీపీపై అవిశ్వాస తీర్మానానికి వినతి
ఆదోని రూరల్/ఆదోని టౌన్: ఆదోని ఎంపీపీపై అవిశ్వాసానికి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు సిద్ధమయ్యారు. ఈ మేరకు గురువారం మండలంలోని 20 మంది వైఎస్సార్‌సీపీ చెందిన ఎంపీటీసీలు ఏకమై ఎంపీపీపై అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించాలని సబ్‌కలెక్టర్ మౌర్యభరద్వాజ్‌ను కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ౖవైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి చంద్రకాంత్‌రెడ్డి, మండలాధ్యక్షుడు గురునాథ్‌రెడ్డి, ఎంపీటీసీలు మాట్లాడారు. ౖవైఎస్సార్‌సీపీ తరఫున గెలిచి వేరే పార్టీలో చేరడంతోనే ఎంపీపీ దానమ్మపై అవిశ్వాస తీర్మానం పెట్టినట్లు తెలిపారు. దానమ్మ పార్టీకి నమ్మకద్రోహం చేసిందని, అందువల్లనే ఆమెను ఎంపీపీ పదవి నుంచి దించాలన్న ఉద్దేశంతోనే తాము ఈ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టినట్లు చెప్పారు. స్పందించిన సబ్‌కలెక్టర్ మౌర్యభరద్వాజ్ మాట్లాడుతూ.. ఎంపీటీసీల వినతి మేరకు 15 రోజుల్లో నోటీసు జారీ చేస్తామన్నారు. అవిశ్వాస తీర్మానంలో ప్రస్తుత ఎంపీపీగా ఉన్న దానమ్మ నెగ్గితే కొనసాగుతారని, లేనిపక్షంలో తదుపరి ఎంపీపీ ఎన్నిక జరుగుతుందన్నారు.
పార్టీకి నమ్మకద్రోహం
వైఎస్సార్‌సీపీ తరఫున కపటి గ్రామ ఎంపీటీసీగా ఏకగ్రీవంగా గెలుపొందిన దానమ్మను అప్పటి ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీపీగా ఎన్నుకున్నారు. ఆదోని మండలంలో మొత్తం 29 మంది ఎంపీటీసీ స్థానాలు ఉండగా మండిగిరి–1, 2, సాదాపురం స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. 26 స్థానాల్లో మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఇందులో ముగ్గురు మృతి చెందగా, ఒకరు రాజీనామా చేశారు. అప్పటి ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఆదేశాల మేరకు కపటి గ్రామానికి చెందిన ఎంపీటీసీ దానమ్మ ఎంపీపీగా ఎన్నుకున్నారు.

ఆదోని ఎంపీపీపై అవిశ్వాస తీర్మానానికి వినతి