
ఫుట్‌బాల్ విజేత కర్నూలు
● బాలికల విభాగంలో అనంతపురం జట్టు
● ముగిసిన రాష్ట్ర స్థాయి పోటీలు
ఎమ్మిగనూరుటౌన్: మూడు రోజులుగా ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్ 19 స్కూల్ గేమ్స్ ఫుట్‌బాల్ పోటీల్లో బాలురు విభాగంలో కర్నూలు జట్లు విజేతగా నిలిచింది. గురువారం ఫైనల్ పోటీలు హోరాహోరీగా సాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి బాలురు, బాలికల జట్లు ఈ పోటీల్లో తలపడ్డాయి. ఈ పోటీల్లో బాలుర విభాగంలో ద్వితీయ స్థానం శ్రీకాకుళం జట్టు, తృతీయ స్థానాన్ని అనంతపురం జిల్లా జట్టు దక్కించుకొంది. అదే విధంగా బాలిక పోటీల్లో మొదటి స్థానాన్ని అనంతపురం జట్టు, ద్వితీయ స్థానాన్ని విశాఖ పట్టణం జట్టు కై వసం చేసుకోగా తృతీయ స్థానం వెస్ట్ గోదావరి జిల్లా జట్టు దక్కించుకొంది. గెలుపొందిన ఆయా జట్లకు జిల్లా ఆర్‌ఐఓ లాలప్ప, మల్లెల గ్రూప్స్ అధినేత మల్లెల ఆల్‌ఫ్రెడ్‌రాజు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి రాఘవేంద్రాచారి, ఫుట్‌బాల్ అసొయేషన్ అధ్యక్షుడు రామకృష్ణ నాయుడు పాటు స్థానిక ప్రజాప్రతినిధులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పోటీల ఆర్గనైజర్లు వ్యాయామ ఉపాధ్యాయులు నరసింహరాజు, హనీఫ్, శ్రీనివాసులు, సీజీ ఈరన్న ,శ్రీరాములు, లతీఫ్, వెంకటేష్, బసవరాజు, గంగాధర్‌తో పాటు పలువురు పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.
మొదటి స్థానంలో నిలిచిన
కర్నూలు బాలుర జట్టు
మొదటి స్థానంలో నిలిచిన
అనంతపురం బాలికల జట్టు

ఫుట్‌బాల్ విజేత కర్నూలు