
ప్రశాంతంగా నంద్యాల డయాసిస్ కమిటీ ఎన్నిక
● సెక్రటరీగా ప్రభుదాసు, ఉపాధ్యక్షుడిగా రాజేంద్రబాబు విజయం
నంద్యాల(న్యూటౌన్): నంద్యాల అధ్యక్ష ఖండం డయాసిస్ కమిటీ ఎన్నిక గురువారం ప్రశాంతంగా జరిగింది. పట్టణంలోని హోలీక్రాస్ కెథడ్రల్ చర్చికి ఎదురుగా ఉన్న డయాసిస్ కార్యాలయ ఆవరణలో బిషప్ సంతోష్ ప్రసన్నరావు ఆధ్వర్యంలో డయాసిస్ సెక్రటరీ, ఉపాధ్యక్షులకు హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారిగా స్టాండ్లీ విలీయం వ్యవహరించారు. ఉదయం 9గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2 గంటకు ముగిసింది. అప్పటి నుంచి కౌంటింగ్ నిర్వహించారు. డయాసిస్ సెక్రటరీగా బైళ్ల ప్రభుదాసు 200 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలాగే ఉపాధ్యక్షుడిగా రెవరెండ్ మేకల రాజేంద్రబాబు 300 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. అలాగే డయాసిస్ ట్రెజరర్‌గా పరిశుద్ధ మత్తయి ఆలయం డీనరీ చైర్మన్ నందం ఐజక్‌ను కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ కమిటీ మూడేళ్ల పాటు 2028 వరకు కొనసాగుతుందని బిషప్ వివరించారు. ఎన్నికై న అభ్యర్థులను ఆయా పాస్టరేట్ల కౌన్సిలర్లు, గురువులు పూలమాలలతోను ఘనంగా సత్కరించారు. నూతనంగా ఎన్నికై న డయాసిస్ సెక్రటరీ బైళ్ల ప్రభుదాస్, ఉపాధ్యక్షుడు మేకల రాజేంద్రబాబు మాట్లాడుతూ.. బిషప్ సంతోష్ ప్రసన్నరావు ఆధ్వర్యంలో నంద్యాల డయాసిస్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. డయాసిస్ ఎన్నికల సందర్భంగా మూడవ పట్టణ సీఐ కంబగిరిరాముడు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉపాధ్యక్షుడు
రాజేంద్రబాబు
సెక్రటరీ
బైళ్ల ప్రభుదాసు

ప్రశాంతంగా నంద్యాల డయాసిస్ కమిటీ ఎన్నిక