
కొనసాగుతున్న వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు వర్షాలు కురిశాయి. కర్నూలు రూరల్‌లో అత్యధికంగా 38.2 మి.మీ, అత్యల్పంగా మద్దికెరలో 1.6 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా మొత్తంగా సగటున 8.3 మి.మీ వర్షం కురిసింది. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 116.5 మి.మీ ఉండగా.. 132.5 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఆగస్టు నుంచి కురుస్తున్న వర్షాలు రైతుల ఆశలను నీరుకారుస్తున్నాయి. తేమ అరకుండా వర్షాలు కురుస్తుండటంతో దాదాపు అన్ని పంటలు దెబ్బతింటున్నాయి. పత్తి, వేరుశనగ తదితర పంటలు పచ్చగా ఉంటున్నా దిగుబడులు లేకుండా పోతున్నాయి. ఉల్లి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అధిక వర్షాల వల్ల పత్తి కాయలు కుళ్లిపోతున్నాయి. వేరుశనగలో కాయలు లొత్తలు పడుతున్నాయి.
మండలం వర్షపాతం(మి.మీ)
కర్నూలు రూరల్ 38.2
కర్నూలు అర్బన్ 33.4
కల్లూరు 17.6
వెల్దుర్తి 13
తుగ్గలి 12.8
పత్తికొండ 11
ఎమ్మిగనూరు 10.8
హొళగుంద 10.6
గోనెగండ్ల 9.8