
పంట తడిచి.. నష్టం మొలకెత్తి!
దొర్నిపాడు: భారీ వర్షాలు అన్నదాతను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. మండలంలో ఈ ఏడాది ఖరీఫ్‌లో మొక్కజొన్నను విస్తారంగా సాగు చేశారు. పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలు పంటను దెబ్బతీశాయి. ప్రస్తుతం పంట కోతకు వచ్చింది. కానీ గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కంకులు చెట్లపైన్నే మొలకెత్తున్నాయి. కోతకోయడానికి పొలమంతా నీరు, బురద ఉండటంతో కోత యంత్రాలు, కూలీలు పొలంలోకి వెళ్లలేని పరిస్థితి. ఇంకా వర్షాలు కురుస్తూనే ఉండటంతో మొక్కజొన్న రైతులు ఆందోళన చెందుతున్నా రు. చేతికొచ్చిన మొక్కజొన్న కళ్ల ముందే పొలంలోనే వర్షాలకు తడిచి కంకులు మొలకెత్తుండటంతో ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.

పంట తడిచి.. నష్టం మొలకెత్తి!