
విగ్రహాల రక్షణే మా లక్ష్యం
వేలాది మంది పాల్గొనే వేడుకల్లో విగ్రహాలను కాపాడుకోవడమే మా మూడు గ్రామాల లక్ష్యం. పలు కట్టుబాట్లతో ఉండంతోనే జైత్రయాత్రలో విగ్రహాలకు దెబ్బలు తగలకుండా రక్షణ కవచగా ఉండి కాపాడుకుంటూ వస్తున్నాం. విగ్రహాలను కై వసం చేసుకోవడానికి అడ్డు పడ్తారనేది అవాస్తవం. మద్యం, మాంసం ముడితే బన్ని ఉత్సవం జరిపే అర్హత కోల్పోతాం. ఉత్సవంలో మా మూడు గ్రామాల ఆచారాలు, పూజలు నిష్ట నిబద్ధత కలిగి ఉంటాయి.
– బసవరాజు, రాక్షస గుండ్లకు రక్తం ఇచ్చే గొరవయ్య, కంచాభీరా వంశస్తుడు, నెరణికి