
నిష్టతో కట్టుబాట్లను పాటిస్తారు
దేవరగట్టు ఉత్సవాల్లో మూడు గ్రామస్తులు నిష్టతో కట్టుబాట్లు పాటిస్తారు. ఇక బన్ని రోజు రెండుసార్లు స్నానం చేస్తారు. సాయంత్రం గట్టుకెళ్లే ముందు ప్రతి ఒక్కరు స్నానమాచారిచి గ్రామంలోని గుడిలకు వెళ్లి టెంకాయలు సమర్పిస్తారు. అనంతరం తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని కొండకు బయలుదేరుతారు. బన్నిలో ఏ ఒక్కరు మద్యం తాగరు, మాంసం ముట్టరు. తాగి కర్రలతో విగ్రహాల దగ్గరకు వచ్చే వారిని కట్టడి చేసి విగ్రహాలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా జైత్రయాత్రలో పాల్గొంటారు.
– రవిశాసీ్త్ర, మాళమల్లేశ్వరునికి కల్యాణం జరిపే పురోహితుడు, నెరణికి