
కర్రలతో కొట్టుకోరు..
దేవరగట్టు బన్ని ఉత్సవంలో భక్తులు కర్రలతో కొట్టుకుంటారనేది అవాస్తవం. ఉత్సవాన్ని కర్రల సమరంగా చెప్పడం భావ్యం కాదు. పూర్వం గట్టు మీదకెక్కడానికి దివిటీలు, జంతువుల నుంచి రక్షణగా కర్రలు, ఆయుధాలు తీసుకెళ్లే వారు. కాలక్రమేణా అవి దురుద్దేశాలకు వాడడంతో కర్రల సమరంగా ముద్ర పడింది. మద్యం సేవించిన వారు మాత్రమే గాయ పడుతారు తప్ప ఇతరులకు గాయాలు కావు. విచక్షణ కోల్పోయి కొట్టుకోవడం వల్ల గతంలో చనిపోయారు. ఇప్పుడు తగ్గిపోయాయి. ఇదొక సంప్రదాయ పండుగ.
– గిరిస్వామి,భవిష్యవాణి వినిపించే ఆలయ పూజారి