
వస్త్రాలయ షాపింగ్ మాల్ ప్రారంభం
కర్నూలు (టౌన్): నగరంలోని నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో బుధవారం వస్త్రాలయ షాపింగ్ మాల్ ప్రారంభమైంది. కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, సినీ హీరోయిన్ నిధి అగర్వాల్, షాపింగ్ మాల్ ఎండీ గోపాల్ రెడ్డి, హరీష్‌రెడ్డి పాల్గొన్నారు. అతిథులు నూతన షాపింగ్ మాల్‌ను రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండీ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తమ వస్త్రాలయ షాపింగ్ మాల్‌లో అపరితమైన కలెక్షన్లు, మెన్స్‌వేర్, ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్, పార్టీ వేర్, 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలు అందు బాటులో ఉన్నాయన్నారు. షాపింగ్ మాల్ ప్రారంభం పురస్కరించుకొని దీపావళి పండుగ వరకు లక్కీ డ్రాలు ఉన్నాయన్నారు. రూ.1000 కొనుగోలు చేస్తే లక్కీ డ్రాలో టీవీ, ఫ్రిడ్జ్, బైక్ వంటి బహుమతులతో పాటు బంపర్ డ్రాలో విజేతకు కారును కూడా అందిస్తున్నామన్నారు.