
రైతులకు న్యాయం చేయాలి
మద్దతు ధరలు లేక పత్తి, సజ్జ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే అధిక వర్షాలతో పత్తి పంట దెబ్బతినింది. మార్కెట్‌లో ధర లేక సజ్జ రైతులు అల్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలి.
– వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, మాజీ చైర్మన్,
జిల్లా వ్యవసాయ సలహా మండలి
ఐదు ఎకరాల సొంత పొలం, మరో పది ఎకరాల కౌల పొలంలో పత్తి సాగు చేశాం. అధిక వర్షాలతో ఎకరాకు 2 క్వింటాళ్లు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. అంతంతమాత్రం వచ్చిన పంటకు ధర లేదు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువైంది.
– వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మీపురం, కల్లూరు మండలం
ఈ ఖరీఫ్ సీజన్‌లో వేరుశనగ 3.50 ఎకరాల్లో సాగు చేశాం. ఎకరాకు రూ.40 వేల ప్రకారం మొత్తం రూ.1.40 లక్షల వరకు పెట్టుబడి వచ్చింది. దిగుబడి 20 క్వింటాళ్లు రాగా మార్కెట్‌కు తీసుకు రాగా ధర లేదు. అప్పు ఎలా తీర్చాలో తెలియడం లేదు.
– వెంకటేష్, చెల్లెలచెలిమల, దేవనకొండ మండలం
కొన్ని రోజులుగా మార్కెట్‌లోకి పత్తి వస్తోంది. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. రైతులకు ఉపయోగమని చెప్పాం. అక్టోబరు మొదటి వారంలో ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
– నారాయణమూర్తి, ఏడీఎం, కర్నూలు

రైతులకు న్యాయం చేయాలి

రైతులకు న్యాయం చేయాలి

రైతులకు న్యాయం చేయాలి