
పిల్లల సంరక్షణపై దృష్టి సారించాలి
కర్నూలు(సెంట్రల్) : చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఉన ్న పిల్లల సంరక్షణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూట్ జిల్లా స్థాయి కమిటీ చైర్మన్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మిషన్ వాత్సల్యలో భాగంగా మొట్ట మొదటి చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూట్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం ఆమె అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ..జిల్లాలో 11 చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయని, అందులో 4 ప్రభుత్వ ఆధీనంలోవి కాగా, మిగిలిన ఏడు స్వచ్ఛంద సంస్థల ద్వారా నడుస్తున్నట్లు చెప్పారు. ఆయా సంస్థల్లో ఉన్న చిన్నారులకు పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ, చదువు, బట్టలు తదితర సేవలన్నీ పక్కాగా అందేలా చూడాలని కోరారు. ఆయా సంస్థల్లో పనిచేసే సిబ్బంది పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. సిబ్బంది పనితీరును గమనించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ విజయ, కమిటీ మెంబర్ సెక్రటరీ టి.శారద, సభుఎ్యలు, మంజుష, ఎస్.మహబూబ్‌బాషా, రాయపాటి శ్రీనివాసులు పాల్గొన్నారు.