
పర్యాటక ప్రదేశాల్లో మరిన్ని సౌకర్యాలు
కర్నూలు కల్చరల్ : పర్యాటక ప్రదేశాల్లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య పేర్కొన్నారు. కర్నూలు రూరల్ మండలం పరిధిలోని సుంకేసుల గ్రామ సమీపంలో సుంకేసుల డ్యామ్ వద్ద పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుడా ఆధ్వర్యంలో పర్యాటక ప్రదేశాల్లో మెరుగైన సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా పర్యాటక, సాంస్కృతిక అధికారి జి.లక్ష్మీనారాయణ, రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.