
● ఆశలు వర్షార్పణం
హొళగుంద: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పంటలు దెబ్బతింటున్నాయి. దీంతో వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హొళగుంద మండలంలో ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన పత్తి, వేరుశనగ, మిరప తదితర పంటలు చేతికి వచ్చాయి. అయితే, సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లాయి. హొళగుంద, గజ్జహళ్లి, ఇంగళదహాల్, పెద్దగోనెహాళ్, పెద్దహ్యాట, వంద వాగిలి, హెబ్బటం, చిన్నహ్యాట తదితర గ్రామాల పరిధిలో దాదాపు 6 వేల ఎకరాల పత్తి పంట నీటిపాలైంది. పొలాల్లో తేమశాతం పెరగడంతో మిరప, వేరుశనగ పైర్లు కుళ్లిపోయాయి. జరిగిన నష్టంపై ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు కోరతున్నారు.
హొళగుంద సమీపంలో పత్తి పొలంలో నిలిచిన వర్షపు నీరు

● ఆశలు వర్షార్పణం