
అట్టహాసంగా ఫుట్‌బాల్ పోటీలు షురూ
ఎమ్మిగనూరు టౌన్: రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైయ్యాయి. కర్నూలు జిల్లా అండర్ –19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఈపోటీలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి బాలబాలికలు హాజరయ్యారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య, ఫుట్‌బాల్ అసోసియేన్ నాయకులు రామకృష్ణ నాయుడు,స్కూల్ గేమ్స్ జిల్లా కార్యదర్శి రాఘవేంద్రఆచారి పోటీలను ప్రారంభించారు. మూడురోజుల పాటు జరిగే ఈ పోటీల్లో తొలి రోజు కృష్ణా–తూర్పుగోదావరి, విజయనగరం–అనంతపురం, పశ్చిమగోదావరి– నెల్లూరు, చిత్తూరు– ప్రకాశం జిల్లాల బాలుర జట్టు తలపడ్డాయి. కాగా పోటీల సమయంలో వర్షం పడటంతో క్రీడాకారులు కొంత ఇబ్బంది పడ్డారు. వర్షపు నీరు నిలవడంతో మైదానం బురదమయంగా మారింది.అయినా, ఆయా జట్ల క్రీడాకారులు ఆటను కొనసాగించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు అక్టోబర్ 5వ తేదీన జమ్ముకాశ్మీర్‌లో జరిగే జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పోటీల రాష్ట్ర పరిశీలకులు ప్రభాకర్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి రామాంజినేయులు,ప్రైవేట్ స్కూళ్ల వ్యాయామ ఉపాధ్యాయుల సంఘ అధ్యక్షుడు సుంకన్న, పోటీల నిర్వాహకులు వ్యాయామ ఉపాధ్యాయులు నరసింహరాజు, శ్రీనివాసులు, హనీఫ్, సీజీ ఈరన్న, శ్రీరాములు,లతీఫ్, వెంకటేష్, బసవరాజు, సురజ్, గంగాధర్, శేషు, మనోహర్, వీరేష్ పలువురు పీఈటీలు పాల్గొన్నారు.
13 జిల్లాల నుంచి తరలివచ్చిన
క్రీడాకారులు

అట్టహాసంగా ఫుట్‌బాల్ పోటీలు షురూ