
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
ఆత్మకూరు: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా యువజన సంక్షేమ శాఖ సెట్కూరు సీఈఓ వేణుగోపాల్ సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం మత్తు పదార్థాలు, వ్యసనం, పర్యవసనాలు, సైబర్ క్రైమ్‌లపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువకులకు సిగరెట్, మద్యం తాగడమేనేది ఫ్యాషన్ అయ్యిందని చెప్పారు. ఈ అలవాటు భవిష్యత్తులో వ్యసనంగా మారి జీవితాన్ని నాశనం చేస్తుందన్నారు. ఈ విషయాన్ని గమనించి మద్యంకు దూరంగా ఉండాలని చెప్పారు. అలాగే ఎవరైనా డ్రగ్స్ వినియోగించినా, విక్రయించినా పది సంవత్సరాలపాటు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారన్నారు. మీ పరిసర ప్రాంతాల్లో మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు తెలిస్తే 1972 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుంకన్న, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కుక్కలదాడిలో జింక మృతి
ఉయ్యాలవాడ: మండ లంలోని హరివరం గ్రా మంలో కుక్కల దాడిలో జింక మృతి చెందింది. తహసీల్దార్ ప్రసాద్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. పొలాల్లో సంచరిస్తున్న జింకలు సోమవారం రాత్రి గ్రామంలోకి వచ్చాయి. గమనించిన కుక్కలు వాటి వెంటపడి దాడి చేయగా ఓ జింక మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు బనగానపల్లె అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. వారు గ్రామానికి చేరుకుని పోస్టుమార్టం నిర్వహించి, అక్కడే జింకకు దహన సంస్కారాలు చేశారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి