
శ్రీమఠంలో వైభవంగా దసరా ఉత్సవాలు ప్రారంభం
మంత్రాలయం రూరల్: శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో సోమవారం దసరా దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలను పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ప్రారంభించారు. పూజా మందిరంలో రెండు ఘట స్తంభాలకు పుష్ప మాలంకరణతో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం గ్రామ దేవత మంచాలమ్మ సన్నిధిలో విరులాభిషేకంచేశారు. శాస్త్రోక్తంగా జరిగిన వేడుకలు భక్తులను ఆకట్టుకున్నాయి.
హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు భవనాల పరిశీలన
కర్నూలు(సెంట్రల్): కర్నూలులో హైకోర్టుబెంచ్ ఏర్పాటుకు అవసరమైన భవనాలను కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి పరిశీలించారు. సోమవారం నగరంలోని మారుతి మెగా సిటీ సమీపంలో ఉన్న ప్రతిభా స్కూలు, నన్నూరు టోల్‌గేట్ దగ్గర ఉన్న ఎస్‌వీఈఎస్ ఒకేషనల్ కాలేజీ భవన సమూదాయాలను ఆమె పరిశీలించారు. ఆయా భవనాల్లో కలియ తిరిగి ఎన్ని భవనాలు ఉన్నాయి, ఎంత విస్తీర్ణం తదితర వివరాలను యాజమన్యాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట కర్నూలు ఆర్‌డీఓ సందీప్‌కుమార్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మహేశ్వరరెడ్డి ఉన్నారు.
వినియోగదారులకు మెరుగైన సేవలు
కర్నూలు(అగ్రికల్చర్): వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కలసికట్టుగా పనిచేద్దామని విద్యుత్ శాఖ(ఏపీఎస్‌పీడీసీఎల్) కర్నూలు సర్కిల్ (ఆపరేషన్) సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్‌ఈ) ఆర్.ప్రదీప్‌కుమార్ అన్నారు. సోమవారం ఏపీఎస్‌పీడీసీఎల్ కర్నూలు సర్కిల్ ఎస్‌ఈగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే ఆయన సీనియర్ అధికారులతో సమావేశమై తాజా పరిస్థితిపై సమీక్షించారు. ఏపీఎస్‌పీడీసీఎల్ పరిధిలోని జిల్లాల్లో కర్నూలును అన్ని విషయాల్లో మొదటిస్థానంలో నిలుపుదామని పిలుపునిచ్చారు. వినియోగదారుల సంతృప్తి స్థాయిని పెంచడానికి ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఈఈలు శేషాద్రి , ఓబులేసు, డీఈఈ బాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఔషధ దుష్ప్రభావాలు వస్తే డయల్ 18001803024
కర్నూలు(హాస్పిటల్): ఔషధాలతో దుష్ప్రభావాలకు గురైతే టోల్ ఫ్రీ నంబర్ 18001803024కు కాల్ చేయాలని కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ చెప్పారు. ఫార్మకో విజిలెన్స్ వారోత్సవాలు–అవగాహన సందర్భంగా సోమవారం ఆమె మాట్లాడారు. కళాశాలలోని ఫార్మకాలజీ విభాగంలోని ఔషధ దుష్ప్రభావాల పర్యవేక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 23వ తేది వరకు 5వ జాతీయ ఫార్మకో విజిలెన్స్ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫార్మకాలజి హెచ్‌ఓడీ డాక్టర్ రాజేష్, ప్రొఫెసర్ డాక్టర్ ఉషారాణి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజేశ్వరమ్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు డాక్టర్ భానుప్రకాష్, డాక్టర్ హరిత, డాక్టర్ రమ్య, డాక్టర్ అల్తాఫ్, డాక్టర్ రాజ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీమఠంలో వైభవంగా దసరా ఉత్సవాలు ప్రారంభం

శ్రీమఠంలో వైభవంగా దసరా ఉత్సవాలు ప్రారంభం

శ్రీమఠంలో వైభవంగా దసరా ఉత్సవాలు ప్రారంభం