
రేషన్ బియ్యం లారీ సీజ్?
ఆదోని అర్బన్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని కర్ణాటక పోలీసులు ఆదివారం రాత్రి సీజ్ చేసినట్లు తెలిసింది. ఆదోని నుంచి అహ్మదాబాద్‌కు 35 టన్నుల రేషన్ బియ్యంతో అక్రమంగా వెళ్తున్న లారీని కర్ణాటక రాష్ట్రం సింధనూరు రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి రశీదులు లేకపోవడంతో లారీని సీజ్ చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఇదిలాఉంటే బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఆదోని పట్టణంలోని నలుగురు కూటమి నాయకుల హస్తం ఉన్నట్లు తెలిసింది. లారీ డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు వారిపైనా కేసు నమోదు చేసినట్లు సమాచారం.