
ఉల్లి పంటను దున్నేసిన రైతు
సి.బెళగల్: కోతకు వచ్చిన ఉల్లి పంటను పొలంలోనే వదిలేసి కొంతమంది రైతులు పశువులు, గొర్రెలకు మేపుగా వదిలివేస్తుండగా, మరికొంత మంది ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. సోమవారం మండల పరిధిలోని పోలకల్ గ్రామానికి చెందిన గోకం దుబ్బన్న అనే ఉల్లి రైతు చేతికి వచ్చిన ఉల్లి పంటను పొలంలోనే ట్రాక్టర్‌తో దున్నించాడు. ఖరీఫ్ సీజన్‌లో భాగంగా రైతు రెండు ఎకరాల పొలంలో ఉల్లి పంటను సాగు చేసుకోగా ప్రస్తుతం చేతికి వచ్చింది. అయితే మార్కెట్‌లో ధర అంతంత మాత్రమే ఉండటంతో సోమవారం కోతకోసిన పంటను ట్రాక్టర్‌తో పొలంలో కలియదున్నేశారు.