
ఊపిరితిత్తుల జబ్బులకు అత్యాధునిక వైద్యం
కర్నూలు(హాస్పిటల్): ఊపిరితిత్తుల జబ్బులకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిందని యశోదా హాస్పిటల్ (హైదరాబాద్) సీనియర్ పల్మనాలజిస్టు డాక్టర్ వి.నాగార్జున మాటూరు అన్నారు. ఆదివారం స్థానిక ఓ హోటల్‌లో ప్రాంతీయ పల్మనాలజీ అప్‌డేట్–2025 పేరుతో వైద్య సదస్సు నిర్వహించారు. రాయలసీమ జిల్లాల నుంచి 250 మందికి పైగా వైద్యులు, వైద్య విద్యార్థులు హాజరయ్యారు. సీఎంఈ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ వి.నాగార్జున మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం, అధిక జనాభా, వైరల్ ఇన్‌ఫెక్షన్ల కారణంగా ఊపిరితిత్తుల జబ్బులు పెరుగుతున్నాయని చెప్పారు. పల్మనాలజీ విభాగం, క్రిటికల్ కేర్ మెడిసిన్ రంగాల్లో కొత్త మందులు, సాంకేతిక పరిజ్ఞానం గురించి వివరించారు. క్లినికల్ ఇంర్వెన్షనల్ పల్మనాలజిస్టు డాక్టర్ వెంకట్ రమణ కోలా మాట్లాడుతూ.. ఐసీయూలో వెంటిలేటర్ వినియోగం, ఎక్మో ద్వారా ఊపిరితిత్తులను, గుండెను ఎలా పనిచేయించాలో వివరించారు. వైద్యులు కుళ్లాయప్ప, శ్రీనివాసరెడ్డి, జి.సుబ్బారావు, నెమలి రవికుమార్‌రెడ్డి పాల్గొన్నారు.