
రెండో రోజూ స్తంభించిన రిజిస్ట్రేషన్ సేవలు
కర్నూలు(సెంట్రల్): దస్తావేజు రైటర్ల పెన్‌డౌన్‌తో రిజిస్ట్రేషన్ సేవలు రెండో రోజూ స్తంభించాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో విక్రయదారులు లేక కళ తప్పి కనిపించాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో రోజుకు దాదాపు 500 రిజిస్ట్రేషన్‌లు జరుగుతాయి. వాటి ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.30 లక్షల నుంచి 40 లక్షల ఆదాయం వస్తుంది. అయితే దస్తావేజు లేఖరుల పెన్‌డౌన్‌తో రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోయాయి. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట శనివారం దస్తావేజు లేఖరులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ఎస్‌ఏ రహమాన్, మహ్మద్ రఫీక్, చంద్రశేఖర్, రామకృష్ణ, నాగరాజు మాట్లాడుతూ..రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని కోరా రు. అలాగే పీడీఈ విధానంలో ఉన్న లోపాలను సరిచేయాలన్నారు. నాయకులురాజా, మహేష్, గోపాల్, జగదీష్, భాస్కర్ గౌడ్, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.