
విద్యార్థుల ‘నడక’ యాతన
● టైర్లు పంక్చరై, పగిలిపోయి నిలిచిన
ఆర్టీసీ బస్సు
● పరీక్షలు రాయలేకపోయిన విద్యార్థులు
హొళగుంద: టైర్లు పంక్చరై, పగిలిపోయి ఆదోని డిపో బస్సు ఆగిపోవడంతో దాదాపు 50 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆలూరు నుంచి సుళువాయి మీదుగా తిరుగుతున్న ఆర్టీసీ బస్సులో శనివారం విరుపాపురం, సుళువాయి, పెద్దహ్యాట, సమ్మతగేరి, ముగుమానుగుందికి చెందిన 50 మంది ఎక్కారు. వీరు హొళగుందలోని జెడ్పీ హైస్కూల్, జూనియర్ కళాశాలకు వెళ్లాల్సి ఉంది. అయితే పెద్దహ్యాట క్రాస్ వద్దకు చేరిన బస్సు వెనుక టైరు పంక్చర్ అయ్యింది. అలాగే ముందు టైరు పగిలిపోయింది. దీంలో బస్సు అక్కడే నిలబడిపోయింది. అందులో ఉన్న విద్యార్థులు దాదాపు నాలుగు కిలోమీటర్ నడిచి హొళగుందకు చేరుకున్నారు. వేళకు చేరుకోకపోవడంతో ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు రాయలేకపోయామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థుల ‘నడక’ యాతన