
పరిహారం పెంచాలి
మేము రెండు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాం. ఎకరాకు పెట్టుబడి వ్యయం రూ.లక్షపైనే వచ్చింది. ఎకరాకు దిగుబడి 50 క్వింటాళ్లు మించడం లేదు. ప్రస్తుతం మార్కెట్‌కు 60 క్వింటాళ్ల ఉల్లి మార్కెట్‌కు తీసుకువచ్చాం. నాణ్యత లేదని ఉల్లిగడ్డలను వ్యాపారులు టెండరు వేయలేదు. ఆదివారం మళ్లీ టెండరు పెడుతామని అధికారులు చెబుతున్నారు. వ్యాపారుల తీరు చూస్తే క్వింటాకు రూ.100, 150 కూడా ధర వేసే పరిస్థితి లేదు. పెట్టుబడి వ్యయాన్ని బట్టి ప్రభుత్వం పరిహారం చెల్లించాలి. ఎకరాకు కనీసం రూ.40 వేల వరకు పరిహారం ఇవ్వాలి.
– మస్తాన్‌వలీ, తడకనపల్లి,
కల్లూరు మండలం
ఈ సారి ఖరీఫ్‌లో ముక్కాల్ ఎకరాలో ఉల్లి సాగు చేశా. పెట్టుబడి రూ.80 వేల వరకు పెట్టా. 70 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దీనిని మార్కెట్‌కు తీసుక వస్తే వ్యాపారులు క్వింటా రూ.429 ధరతో కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా పరిహారం ముక్కాల్ ఎకరాకు రూ.15వేలు వస్తుంది. అంటే రైతుకు దక్కుతున్న మొత్తం రూ.45 వేలు మాత్రమే. పెట్టుబడిలో 50 శాతం మాత్రమే దక్కుతుంది. ప్రభుత్వం పెట్టుబడి వ్యయాన్ని బట్టి పరిహారం ఇవ్వాలి.
– వీరేష్, చిన్న కొతిలి, నందవరం మండలం

పరిహారం పెంచాలి