
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కల్లూరు: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలోని వివిధ విభాగాల్లో పదవులు పొందిన వారందరూ బాధ్యతయుతంగా పనిచేయాలని ఆ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి సూచించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మణిరెడ్డి శనివారం కాటసాని రాంభూపాల్‌రెడ్డిని స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలతో సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో కష్టపడే కార్యకర్తలకు పదవులు వరిస్తాయన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పదవులు పొందిన వారందరూ సమన్వయంగా, సమష్టిగా పని చేయాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ లక్ష్మికాంతరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు మధుసూదన్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, శివారెడ్డి, ఎ. గోకులపాడు గ్రామ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.