ఇద్దరి కుమార్తెలతో తల్లి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

ఇద్దరి కుమార్తెలతో తల్లి అదృశ్యం

Sep 21 2025 1:13 AM | Updated on Sep 21 2025 1:13 AM

ఇద్దర

ఇద్దరి కుమార్తెలతో తల్లి అదృశ్యం

● గొర్రెల మేతగా ఉల్లి పంట

● గొర్రెల మేతగా ఉల్లి పంట
ఉల్లి పంటను గొర్రెలకు మేతగా వదిలేసిన ఈ దృశ్యం సి.బెళగల్‌ గ్రామ సమీపంలో శనివారం కనిపించింది. రైతు కురువ నాగన్న తన రెండు ఎకరాల పొలంలో ఉల్లి సాగు చేశాడు. పంట చేతికి రావడంతో ఉల్లి కోతకు సిద్ధమయ్యాడు. అయితే మార్కెట్లో ఆశించిన స్థాయిలో ధరలు లేకపోవడంతో ఆప్పులు అవుతాయని రైతులు ఆందోళన చెందాడు. దీంతో శనివారం రెండు ఎకరాల పొలంలోని ఉల్లి పంటను గొర్రెలకు వదిలేశాడు. ఇన్నేళ్ల కాలంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు అని రైతు కురువ నాగన్న కన్నీటి పర్యంతమయ్యాడు. – సి.బెళగల్‌

నంద్యాల(అర్బన్‌): జిల్లా కేంద్రం నంద్యాల పట్టణంలో ఓ మహిళ, తన ఇద్దరు కుమార్తెలు ఈనెల 4వ తేదీ నుంచి కనిపించడం లేదు. నంద్యాల రూరల్‌ స్టేషన్‌ ఎస్‌ఐ జాకీర్‌హుసేన్‌ తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని విజయనగర కాలనీలో నివాసముంటున్న మరాఠీ కులానికి చెందిన బాషాకు భార్య నర్సమ్మ (46), నందిని (21), స్వప్న(19) ఉన్నారు. ఈ నెల 4వ తేదీ ఉదయం నర్సమ్మ, నందిని, స్వప్నతో పాటు బంధువులు అయిన తులసి, శోభాతో కలిసి సమీపంలోని క్రాంతినగర్‌ వద్ద వంట చెరకు కోసం వెళ్లారు. కొద్ది సేపటి తర్వాత నర్సమ్మ, ఆమె పిల్లలు కనిపించడం లేదని వెంట వెళ్లిన ఇద్దరు వెతుకులాట ప్రారంభించారు. కనిపించకపోవడంతో వారి కుటుంబీకులకు విషయం తెలిపారు. రెండు రోజులుగా కుటుంబీకు లు చుట్టు పక్కల గాలించినా ఆచూకీ తెలియలేదు. దీంతో తన భార్య, ఇద్దరు కుమార్తెలు కనిపించడం లేదని ఈనెల 6వ తేదీన బాషా రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే ఇటీవల పోలీసు పీజీఆర్‌ఎస్‌లో తన భార్యా పిల్లల ఆచూకీ తెలపాలంటూ బాషా ఫిర్యాదు సైతం చేశారు. తన భార్యాపిల్లల ఆచూకీ తెలిస్తే 9000850771, 950291731 సమాచారం ఇవ్వాలని బాషా కోరుతున్నారు. నర్సమ్మ ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు ఆధార్‌ కార్డు లు, పొదుపు డబ్బులు రూ. 17 వేలు డ్రా చేసుకుని వెళ్లినట్లు సమాచారం. భార్యభర్తల మధ్య చిన్న పాటి గొడవలతో మనస్తాపం చెందిన నర్సమ్మ కుమార్తెలతో ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. నర్సమ్మ సొంతూరైన తెలంగాణ రాష్ట్రంలోని సూర్యపేట, సమీపంలోని కోదాడా, జగ్గయ్యపేట, తదితర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. కాగా మిస్సింగ్‌ కేసుల దర్యాప్తు సమయంలో పోలీసుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆచూకీ జాప్యమవుతుందని పలువురు విమర్శలు చేస్తున్నారు.

నర్సమ్మ (ఫైల్‌) నందిని (ఫైల్‌) స్వప్న (ఫైల్‌)

ఇద్దరి కుమార్తెలతో తల్లి అదృశ్యం 1
1/3

ఇద్దరి కుమార్తెలతో తల్లి అదృశ్యం

ఇద్దరి కుమార్తెలతో తల్లి అదృశ్యం 2
2/3

ఇద్దరి కుమార్తెలతో తల్లి అదృశ్యం

ఇద్దరి కుమార్తెలతో తల్లి అదృశ్యం 3
3/3

ఇద్దరి కుమార్తెలతో తల్లి అదృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement