
దళిత, గిరిజనులను మోసం చేస్తున్న ప్రభుత్వాలు
కర్నూలు(అర్బన్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఇతర సంక్షేమ పథకాలకు మళ్లిస్తు దళిత, గిరిజనులను మోసం చేస్తున్నాయని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సి. మహేష్, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి వి. నాగరాజు ఆరోపించారు. శనివారం స్థానిక ఎస్సీ కార్పొరేషన్ ఎదుట డీహెచ్‌పీఎస్ నగర కార్యదర్శి కుమార్ రాజా అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటి పోతున్నా, సబ్‌ప్లాన్ నిధుల గురించి మాట్లాడకపోవడం దుర్మార్గమన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దళిత, గిరిజనుల పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తోందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ పథకం నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ పథకానికి సంబంఽధించి గత నాలుగేళ్లుగా నిధులు విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని లేని పక్షంలో ఆయా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ రామచంద్ర, కోశాధికారి సీ కుమార్, ఉపాధ్యక్షురాలు కోటమ్మ, నాయకులు అంజి, రమేష్, శ్రీను, ఏసన్న, వై నాగరాజు తదితరులు పాల్గొన్నారు.