
మృతదేహంతో ఆందోళన
ఆదోని అర్బన్: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కౌతాళం మండలం బదినేహాల్ గ్రామానికి చెందిన మల్లికార్జున మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆస్పరి మండలం చిరుమాన్‌దొడ్డి గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్లికార్జున మృతిచెందిన విషయం విధితమే. అయితే, మృతుడి వెంట ఆటోలో ఇద్దరు వెళ్లారని, ప్రమాదంలో వారికి ఎలాంటి గాయా లు కాకుండా మల్లికార్జున ఒక్కడే చనిపోవడం నుమానాలురేకెత్తిస్తున్నాయని కుటుంసభ్యులు ఆరోపించారు. కాగా ఆసుపత్రి ఎదుట ఆందోళన విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ శ్రీరామ్ అక్కడికి చేరుకొని మృతుడి కుటుంబసభ్యులతో మాట్లాడారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.