
ప్రైవేట్ స్కూళ్ల తనిఖీలకు కమిటీలు
కర్నూలు సిటీ: నగరంలోని అన్ని ప్రైవేట్ స్కూళ్లను తనిఖీ చేసేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నామని డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్ తెలిపారు. ప్రత్యేక కమిటీ సభ్యులు ప్రైవేట్ స్కూళ్లలో భవనాల భద్రతను, అనుమతులను తనిఖీ చేస్తారన్నారు. కర్నూలు కవాడీవీధిలోని కీర్తిహైస్కూల్‌లో గోడ కూలి ఓ విద్యార్థి రాఖీబ్ మృతి చెందిన విషయం తెలిసిందే. విద్యార్థి కుటుంబ సభ్యులను మంగళవారం డీఈఓ పరామర్శించారు. అదే విధంగా డీఈఓకు ఫోన్ చేసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి..విద్యార్థి కుటుంబాన్ని ప రామర్శించారు. ప్రమాదానికి కారణమైన స్కూల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థి కుటుంబానికి సొంతఇల్లు లేకపోతే ఇంటి స్థలం మంజూరు చే యాలని ఆర్డీఓను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కీర్తి హైస్కూల్‌లో కూలిన గోడను డీఈఓ శ్యామూల్ పాల్ పరిశీలించారు. విద్యార్థి మృతి ఘటనపై పాఠశాల వివరణ కోరామని, వారి నుంచి ఎలాంటి వివరణ రాలేదన్నారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని డీఈఓ పేర్కొన్నారు.