
చెరువు కాదు.. రోడ్డే!
ఆదోని పట్టణంలోని అర్దగేరి బస్టాండ్ నుంచి మాధవరం వేళ్లే రహదారి ఇలా కనిపిస్తోంది. నిత్యం వందలాది వాహనాలు తిరిగే ఈ రోడ్డుపై ప్రయాణమంటేనే ప్రజలు హడలి పోతున్నారు. రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులను ఆదోని మార్కెట్‌యార్డులో విక్రయించేందుకు ఈ రోడ్డు నుంచే రావాల్సి ఉంది. అయితే అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడం లేదు. దీంతో ఈ రోడ్డుపై ఏర్పడిన గుంతలు చెరువులను మరిపిస్తున్నాయి. ఈ రోడ్డుపై నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు చోటు చేసుకుంటునే ఉన్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఈ రోడ్డు పూర్తి స్థాయిలో వర్షపు నీటి మయంగా మారింది. ఇదే రోడ్డులో మరో ప్రాంతంలో రోడ్డుపై ఒక పెద్ద గుంత ఏర్పడింది. రాత్రి సమయాల్లో అధిక శాతం ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

చెరువు కాదు.. రోడ్డే!