
రైతుల ఉసురుకు కూటమి కొట్టుకుపోతుంది!
● టీడీపీ నాయకులకే యూరియా
● ఈ కష్టాలు రైతులకు ఎప్పుడూ రాలేదు
బొమ్మలసత్రం: రైతుల ఉసురు పోసుకుని కూటమి ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో కొట్టుకుపోతుందని ఎమ్మెల్సీ ఇషాక్‌బాషా విమర్శించారు. నంద్యాల మాజీ ఎమ్యెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయ పనులు చేసుకోనివ్వకుండా కూటమి ప్రభుత్వం యూరియా కోసం రోడ్డెక్కేలా చేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించేందుకు వెళ్తే రైతులపై కేసులు పెట్టి కక్షపూరితంగా వ్యవహరించడం తగదన్నారు. రాష్ట్రానికి అరకొరగా వచ్చిన యూరియాను సీఎం చంద్రబాబు ఇచ్చిన దోచుకో.. దాచుకో.. పిలుపు మేరకూ టీడీపీ నాయకులు యూరియాను దోచుకోవడం, బ్లాక్ మార్కెట్‌కు తరలించడం జరుగతుందన్నారు. సెప్టెంబర్ నెలలో 1.55 లక్షల టన్నుల యూరియా రాష్ట్రానికి అవసరం కాగా 94 వేల టన్నులు మాత్రమే పంపిణీ జరిగిందన్నారు. తక్కువ నిల్వలను కూడా కావాల్సిన వారికి ఇచ్చుకుంటున్నారని విమర్శించారు. మినుములు ప్రభుత్వం రూ.8 వేలు గిట్టుబాటు ధర కల్పిస్తుందని చెబుతున్నా రూ. 4 వేలు మాత్రమే లభిస్తుందన్నారు. రైతుల సమస్యల పరిష్కరించాలని వైఎస్సార్‌సీపీ పిలుపు మేరకూ జిల్లా కలెక్టర్‌కు ఈనెల 9న వినతి పత్రం అందిస్తున్నామన్నారు.
గత ప్రభుత్వంలో
పుష్కలంగా యూరియా..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రైతులకు యూరియా పుష్కలంగా లభించేదని పీఏసీఎస్ మాజీ ప్రెసిడెంట్ రామసుబ్బారెడ్డి గుర్తుచేశారు. కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి రైతులు సాగునీటి, ఎరువుల కోసం రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. యూరియా సరఫరాలో విఫలమైన చంద్రబాబు.. యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. సకాలంలో పంటలకు యూరియా వేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. సమావేశంలో మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్‌లు పురుషోత్తంరెడ్డి, విజయశేఖర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దాల్‌మిల్ అమీర్, సెక్రెటరీ సోమశేఖర్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షులు బసవేశ్వరరెడ్డి, కౌన్సిలర్ ఆరిఫ్‌నాయక్, ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు.