
రాజకీయ వివక్ష తగదు
కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక వసతులతో నిర్మించిన టీటీడీ కల్యాణ మండపాలు నిరుపయోగంగా ఉండటం దురదృష్టకరం. పేద, మధ్య తరగతి ప్రజలకు కల్యాణ మండపాలను అందుబాటులోకి తీసుకురాకుండా నిర్లక్ష్యం చేయడం కూటమి నేతల రాజకీయ వివక్షతకు నిదర్శనం. – మల్యాల భాస్కర్ రెడ్డి,
రైతు, మల్యాల గ్రామం, డోన్ మండలం
పేద ప్రజలు తమ పిల్లల వివాహాలను ప్రైవేటు ఫంక్షన్ హాళ్లలో నిర్వహించాలంటే ప్రస్తుతం ఖర్చు కూడన్నది. కొందరు సీజన్ అంటూ అధిక ధరలు వసూలు చేస్తున్నారు. టీటీడీ కల్యాణ మండపాలను వెంటనే వినియోగంలోకి తేవాలి పేద, మధ్యతరగతి ప్రజలపై భారం తగ్గుతుంది.
– నరసింహారెడ్డి, యాపదిన్నె గ్రామం, డోన్ మండలం
టీటీడీ చేపట్టే ధార్మిక కార్యక్రమాలలో భాగంగా గుండాలలో రూ.5 కోట్లతోనూ, పట్టణంలో రూ.3.5 కోట్లతో కల్యాణ మండపాలను నిర్మించింది. రాజకీయ విబేధాలు పక్కకు పెట్టి వీలైనంత త్వరగా వాటిని ప్రజలకు అందుబాటులోకి తేవాలి. – పోస్టు ప్రసాద్,
వైఎస్సార్‌సీపీ జిల్లా వలంటీర్ విభాగం అధ్యక్షులు

రాజకీయ వివక్ష తగదు

రాజకీయ వివక్ష తగదు