
● రేపటి నుంచి సద్గురు 354వ ఆరాధన మహోత్సవాలు ● 14వ తేదీ
మంత్రాలయం: వేదభూమి ప్రదాత.. భవనమోహనుడు సద్గురు రాఘవేంద్రస్వామి. మధ్వమత సార్వభౌముడిగా జగద్విఖ్యాతి గడించి భక్తకోటి వేల్పువుగా వర్ధిల్లుతున్నారు. సద్గురు సశరీరంగా చింతామణి సదృశ్యులైన శ్రీరాఘవేంద్రుల 354వ ఆరాధన సప్తరాత్రోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆశీస్సులతో ఏడు రోజుల పాటు వేడుకలు వైభవంగా జరగనున్నా యి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి దాదాపు 2 లక్షల భక్తులు తరలివచ్చి వేడుకల్లో తరించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఇప్పటికే వేదభూమి విద్యుద్దీప కాంతులతో కాంతులీనుతోంది. రోజూ రాయరు రథోత్సవాలతోపాటు రాములోరి సంస్థాన పూజలు ఉంటాయి. భక్తుల కోసం యోగీంద్ర మండపంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ఉత్సవ విశేషాలు
● శుక్రవారం ఉత్సవాల ప్రారంభోత్సవంలో భా గంగా ధ్వజారోహణ, ధాన్యపూజ, గోవు, తురగ పూజ, ప్రార్థనోత్సవం కానిస్తారు. ఉదయం తిరుమ ల తిరుపతి దేవస్థానం, కాంచీపురం వరదరాజుల క్షేత్రం, శ్రీరంగపట్నం రంగనాథ స్వామి ఆలయాల నుంచి పట్టువస్త్రాల సమర్పణ ఉంటుంది.
● శనివారం శాఖోత్సవం, రజత మంటపోత్సవం చేపడతారు.
● ఆదివారం పూర్వారాధన సందర్భంగా సింహవాహనంపై ప్రహ్లాదరాయల ఊరేగింపు ఉంటుంది. సాయంత్రం యోగీంద్ర మంటపంలో ప్రముఖుల కు అనుగ్రహ ప్రశస్థి అవార్డు ప్రదానం గావిస్తా రు. అలాగే తొలిసారిగా క్షేత్రంలో స్వామి తెప్పోత్స వం నిర్వహించనున్నారు.
● సోమవారం మధ్యారాధన పురస్కరించుకుని రాఘవేంద్రుల మూల బృందావనానికి మహా పంచామృతాభిషేకం చేస్తారు. బంగారు పాదుక పట్టాభిషేకంతోపాటు మధ్యాహ్నం పాదుకలు, ప్రతిమలు బంగారు రథంపై ఊరేగింపు కానిస్తారు. రాత్రి గజవాహనోత్సవంతోపాటు రజత, సువర్ణ రథోత్సవాలు ఉంటాయి.
● మంగళవారం ఉత్తరారాధన సందర్భంగా క్షేత్రంలో రాఘవేంద్రుల మహా రథోత్సవం అంగరంగ వైభవంగా చేపడతారు. హెలికాప్టర్‌తో పుష్పవృష్టి ఉంటుంది. అలాగే రాఘవేంద్రుల మూల బృందావనానికి తొలిసారి వజ్రరత్న కవచ ధారణ కానించనున్నారు.
● బుధవారం పూర్వపు పీఠాధిపతి సుజ్ఞానేంద్రుల ఆరాధన, అశ్వవాహన సేవలు
కానిస్తారు.
● గురువారం సర్వ సమర్పణోత్సవంలో భాగంగా బంగారు పల్లకీ, చెక్క, వెండి, బంగారు రథోత్సవాలు ఉంటాయి.
బంగారు కాంతుల్లో శ్రీమఠం కారిడార్
భక్తులకు ఏర్పాట్లు
ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం 5 లక్షల పరిమళ ప్రసాదాలు తయారు చేశారు. కాలకృత్యాలు తీర్యుకునేందుకు అన్నపూర్ణ భోజనశాల, నదీతీరం, సీఆర్వో కార్యాలయం, 200 గదుల సముదాయంతో శౌచాలయాలు ఏర్పాటు చేశారు. తుంగభద్ర నదిలో వరద నీరు ఉధృతంగా పారుతుండటంతో పుణ్య స్నానాలకు ప్రత్యేక షవర్లు ఉన్నాయి. మఠం సీఆర్‌ఓ, ప్రధాన ముఖధ్వారం, మఠం ప్రాకారం, అన్నపూర్ణ భోజనశాల దారిలో వాటర్ ప్లాంట్లు నెలకొల్పారు. ఉత్సవాలను మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్–1 శ్రీనివాసరావు, మేనేజర్–2 వెంకటేష్‌జోషి, మేనేజర్–3 శ్రీపతిఆచార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సురేష్ కోనాపూర్ భక్తులు ఏర్పాట్లు పర్యవేక్షించనున్నారు.

● రేపటి నుంచి సద్గురు 354వ ఆరాధన మహోత్సవాలు ● 14వ తేదీ

● రేపటి నుంచి సద్గురు 354వ ఆరాధన మహోత్సవాలు ● 14వ తేదీ

● రేపటి నుంచి సద్గురు 354వ ఆరాధన మహోత్సవాలు ● 14వ తేదీ