
విద్యార్థి దశలోనే అలవాటు చేయాలి
మేధావుల అనుభవాలకు అక్షర రూపం పుస్తకం. ఇవి పాఠకుల్లో జ్ఞానాన్ని, నైతిక విలువలను పెంపొందిస్తాయి. విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందిస్తూ మంచి మిత్రునిలా తోడుండి సమాజాన్ని అర్థం చేసుకోవడానికి సహాయ పడతాయి. విద్యార్థులు సెల్‌ఫోన్లకు బానిసలుగా మారకుండా నిరంతరం సామాజిక మాధ్యమాల్లో మునిగిపోయి చుట్టూ ఉన్న మనుసులతో సంబంధాలు కోల్పోకుండా పుస్తకాలు కాపాడతాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యార్థి దశ నుంచే పుస్తకాలు చదివించడం గ్రంథాలయాలకు తీసుకొని వెళ్లడం అలవాటు చేయాలి.
– డాక్టర్ ఎం. హరికిషన్, ఉపాధ్యాయులు, బాలల కథా రచయిత