
తనిష్క్‌లో వజ్రాభరణాల ప్రదర్శన ప్రారంభం
కర్నూలు (టౌన్): నగరంలోని స్థానిక గాంధీనగర్‌లో ఉన్న తనిష్క్ షోరూంలో ప్రత్యేకంగా వజ్రాభరణాల ప్రదర్శన ప్రారంభించినట్లు షోరూం నిర్వహకులు ముప్పా ధీరజ్, కృష్ణ వెల్లడించారు. షోరూంలో శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలోని 450 స్ట్రోర్ల నుంచి ఎంపిక చేసిన అద్భుతమైన డైమండ్ అభరణాలను అందుబాటులో ఉంచామన్నారు. ఈనెల 10వ తేదీ వరకు ఈ ప్రదర్శన ఉంటుందన్నారు. కార్యక్రమంలో ముప్పా భరత్, షోరూం మేనేజర్ ప్రవీణ్ పాల్గొన్నారు. ●
ఈటీపీఎస్‌లో డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి
కర్నూలు(సెంట్రల్): అన్ని శాఖల అధికారులు తమ కార్యాలయాలకు చెందిన డాక్యుమెంట్లను ఈటీపీఎస్ ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఈటీపీఎస్ ఆన్‌లైన్ పోర్టల్‌లో డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసే అంశంపై కలెక్టర్ తహసీల్దార్లు, ఎంపీడీఓలతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు తమ కార్యాలయాలకు సంబంధించిన చట్టాలు, నియమ నిబంధనలు, కోర్టు ఆర్డర్లు, మెమోలు, జీఓలు, సర్కులర్లు, ప్రోసీడింగ్స్ తదితర ముఖ్యమైన డాక్యుమెంట్లను స్కానింగ్ చేసి ఈటీపీఎస్ ఆన్‌లైన్‌లో పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. రియల్ టైం గవర్నెన్స్‌లో ఈ ప్రక్రియ నిర్వహించడం జరుగుతోందని, అన్ని శాఖల అధికారులు మూడో రోజుల్లోపు అప్‌లోడ్ చేయాలన్నారు. అంశంపై పర్యవేక్షణ చేయాలని డీఆర్వోను ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో జేసీ డాక్టర్ బి.నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, కర్నూలు, పత్తికొండ ఆర్‌డీఓలు సందీప్‌కుమార్, భరత్‌నాయక్, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి పాల్గొన్నారు.