
శ్రీమఠంలో సినీనటుడు సాయికుమార్
మంత్రాలయం: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం మంగళవారం సినీనటుడు సాయికుమార్ విచ్చేశారు. ఆయన మఠం కారిడార్‌కు చేరుకోగా ధార్మిక అధికారి శ్రీపతి ఆచార్, సహాయ పీఆర్వో వ్యాసరాజాచార్‌లు సాంప్రదాయబద్ధంగా ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. ఆయన ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని అర్చన సహిత హారతులు పట్టా రు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూలబృందావనానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనకు మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు శేషవస్త్రం కప్పి, స్వామి వారి అక్షితలు అందజేసి ఆశీర్వదించారు. స్వామి వారి జ్ఞాపికను బహూకరించారు.
చేనేత దినోత్సవం
ఘనంగా నిర్వహిద్దాం
కర్నూలు(అర్బన్): ఈ నెల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం స్థానిక బిర్లా కాంపౌండ్‌లో ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్, చేనేత కుల సంఘాల సమాఖ్య కర్నూలు యూనిట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ చేనేత దినోత్సవం సందర్భంగా 7న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ సమీపంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళి, అనంతరం 11.30 గంటలకు చేనేత జౌళి శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో చేనేత సమస్యలపై చర్చించి మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రాలను అందిస్తామన్నారు. చేనేత సామాజిక వర్గానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. నాయకులు చింత శ్రీనివాసులు, దాశెట్టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీమఠంలో సినీనటుడు సాయికుమార్