
మద్యం దుకాణం వద్ద వ్యక్తి మృతి
కోడుమూరు రూరల్: కోడుమూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి మద్యం దుకాణం వద్ద మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం 6 గంటలకు చోటుచేసుకుంది. కోడుమూరుకు చెందిన ఆంజనేయులు (37)కు భార్యాపిల్లలు లేరు. తాపీ పనిచేస్తూ బతికేవాడు. మద్యానికి అలవాటు పడి ఆదివారం సాయంత్రం కోడుమూరు పట్టణంలోని వెంకటగిరి రోడ్డులో గల ఓ మద్యం దుకాణం వద్ద వచ్చాడు. అతిగా మద్యం తాగి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న సమీప బంధువులు మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లారు. కాగా.. మద్యం దుకాణం వద్ద అనధికారికంగా ఏర్పాటు చేసిన పర్మిట్ రూమ్‌లో ఆంజనేయులు మద్యం తాగి మృతిచెందినట్లు సమాచారం. అయితే నిర్వాహకులు ఎక్కడ తమపైకి సమస్య వస్తుందోనని గ్రహించి ఆంజనేయులు మృతదేహాన్ని అనధికారిక పర్మిట్ రూమ్‌లో నుంచి తెచ్చి తమ దుకాణానికి కొద్ది దూరంలో పడేసి వెళ్లినట్లు తెలిసింది.