
మహిళలు, బాలికలే లక్ష్యంగా నేరాలు
కర్నూలు: ఇంటర్నెట్, మొబైల్ డేటా అందుబాటులోకి వచ్చాక మహిళలు, యువతులు, బాలికలను లక్ష్యంగా చేసుకుని నేరాలు పెరిగిపోతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. కర్నూలు శివారులోని పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో మహిళలు, పిల్లల భద్రతపై విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ ముఖ్య అతిథిగా మాట్లాడారు. మహిళలు, చిన్నపిల్లలపై జరిగే నేరాలను అరికట్టేందుకు మహిళా సంక్షేమం, భద్రత, మహిళా సాధికారత అనే అంశాలపై జిల్లా అంతటా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళా భద్రతకు పటిష్టమైన చట్టాలు, శక్తి టీమ్, శక్తి యాప్ లాంటివి ఉన్నాయన్నారు. ఎవరైనా ఈవ్ టీజింగ్‌కు పాల్పడితే శక్తి వాట్సప్ నంబర్ 7993485111, డయల్ 100, 112, కర్నూలు శక్తి వాట్సప్ 7777877700, చైల్డ్ మ్యారెజెస్ 1098, సైబర్ క్రైం 1930లకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, మహిళా పీఎస్ డీఎస్పీ శ్రీనివాసాచారి, పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల డీన్ డాక్టర్ దేవకీ దేవి, సీఐలు శ్రీధర్, విజయలక్ష్మి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
జాగ్రత్తగా ఉండాలి
ఎస్పీ విక్రాంత్ పాటిల్