
మెట్టకు ప్రాణం పోసిన అపర భగీరథుడు
ఆత్మకూరు: వర్షాధార పంటలు పండే మెట్ట భూములకు మహానేత వైఎస్సార్ ప్రాణం పోసి అపరభగీరథుడుగా మారారు. ఆత్మకూరు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో ఒకే సారి ఐదు ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసి మెట్ట భూములను ఆయకట్టుగా మార్చారు. జలయజ్ఞంలో భాగంగా సిద్దాపురం, చెలిమెళ్ల, లింగాల, శివపురం, ఇస్కాల ఎత్తిపోతల పథకాలతో దాదాపు 30 వేల ఎకరాలకు పైగా నీరందించారు. 2006లో ఈ పథకాలకు నిధులు మంజూరు చేయడంతో పథకాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం రైతులు రెండు పంటలు పండిస్తూ నేటికీ మహానేత మేలును తలుచుకుంటున్నారు.
కోవెలకుంట్ల: రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేయాలన్న మహానేత సంకల్పం జలయజ్ఞంతో సాకారమైంది. రెండు టీఎంసీల సామర్థ్యం ఉన్న అవుకు రిజర్వాయర్‌ను రూ. 70 కోట్లతో నాలుగు టీఎంసీల సామర్థ్యానికి పెంచేందుకు 2005 నవంబర్‌లో శంకుస్థాపన చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి అవుకు రిజర్వాయర్‌లోకి నీరు చేరేందుకు 30వ ప్యాకేజీ కింద రూ. 401కోట్లతో 12కి లోమీటర్ల మేర రెండు సొరంగ మార్గాలను ఏర్పాటు చేసి వీటి ద్వారా 20 వేల క్యూసెక్కుల వరద జలాలను రిజర్వాయర్‌లో నింపాల్సి ఉంది. 2010 నాటికే ఒక సొరంగం గుండా వైఎస్సార్ జిల్లా గండికోటకు నీటిని విడుదల చేయాలి. వైఎస్సార్ మరణం తర్వాత కిరణ్ సర్కార్, 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం జలయజ్ఞ పనులను నిర్లక్ష్యం చేయడంతో పది శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయి. 2019లో అధికారంలో వచ్చిన జగన్ సర్కార్ ఆ పనులను పూర్తి చేసి ఒక్కో సొరంగం ద్వారా పదివేల క్యూసెక్కుల నీటి విడుదలకు మార్గం సుగమం చేసింది. జిల్లాతోపాటు వైఎస్సార్, చిత్తూరు జిల్లాల ప్రజలకు శాశ్వితంగా తాగునీరు, సాగునీటి కష్టాలను తీర్చాలన్న ఉద్దేశంలో అవుకు రిజర్వాయర్‌కు అనుసంధానంగా గత ప్రభుత్వం రూ. 300 కోట్లతో 5.9 కిమీ పొడవునా మూడో సొరంగం నిర్మాణం చేపట్టింది.
అవుకు రిజర్వాయర్
‘జల’హో రాజన్న!

మెట్టకు ప్రాణం పోసిన అపర భగీరథుడు