
జలయజ్ఞంతో మారిన సాగు ముఖచిత్రం
● నిత్యం కరువుతో అల్లాడుతున్న పత్తికొండ నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువ ఏర్పాటుతోకృష్ణాజలాలను పారించి సస్యశామలం చేశారు.
● కృష్ణగిరి, పందికోన రిజర్వాయర్లను ఏర్పాటు చేసి దాదాపుగా 80వేల ఎకరాలకు సాగు నీరు అందించే దిశగా చర్యలు చేపట్టారు.
● దేవనకొండ, తుగ్గలి, కృష్ణగిరి, డోన్ మండలంలోని 50 గ్రామాలకు, డోన్‌పట్టణానికి గాజులదిన్నె ప్రాజెక్టు ద్వారా రూ.55కోట్లతో తాగునీటిని అందించారు.
● హంద్రీనీవాలో భాగంగా వెల్దుర్తి మండలం మల్లెపల్లె వద్ద ఎత్తిపోతల పథకం, కృష్ణగిరి మండలంలో కృష్ణగిరి, కంబాలపాడు, ఆలంకొండ ఎత్తిపోతల పథకాలతోపాటు కృష్ణగిరి సమీపంలో 0.016 టీఎంసీలతో రిజర్వాయర్ నిర్మించి ఏడు గ్రామాల్లోని 5,100 ఎకరాలకు సాగునీటిని అందించారు.
● పత్తికొండ మండలంలోని పందికోన వద్ద ఒకటిన్నర టీఎంసీతో 60వేల ఎకరాలకు సాగునీరు పారించారు.
● లక్కసాగరం వద్ద, దేవనకొండ మండలం గుండ్లకొండ ఎత్తిపోతల పథకం సమీపంలో చానల్ కాలువలు ఏర్పాటు చేసి వీటి ద్వారా మరో 5,100 ఎకరాలను సస్యశ్యామలం చేశారు.