
మాటలకందని అభిమానం..
నంద్యాల పట్టణం పప్పుల బట్టి ప్రాంతంలోని నామలయ్య బడి దగ్గర వీడియో గేమ్స్ షాప్ యజమాని పేరు కృష్ణమూర్తి. భార్య పుష్పలత దేవి గృహిణి. వీరికి 2006లో కొడుకు శబరీష్ పుట్టాడు. ఏడాదిన్నర తర్వాత ఆ బాలుడికి సైగలు చేసినా స్పందించకపోవడం, మాటలు రాకపోవడంతో వైద్యుడిని సంప్రదించి, పరీక్షలు చేయించారు. పుట్టుకతో మూగ, చెవిటి వాడిగా తేలింది. దీంతో కృష్ణమూర్తి దంపతులు కృంగిపోయారు. చిన్న వయస్సులోనే సర్జరీ చేస్తే మాటలు, వినికిడి శక్తి వస్తుందని స్నేహితులు సలహానివ్వడంతో ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని 2009 ఫిబ్రవరిలోగుంటూరులోని కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. శబరీష్‌కు అదృష్టవశాత్తూ ఆరోగ్యశ్రీ పథకం కింద కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయడానికి రూ.6.50 లక్షలు మంజూరయ్యాయి. దీంతో సర్జరీ చేయడంతో వినికిడి, మాటలు వచ్చాయి. తమ కుమారుడు శబరీష్‌కు బంగారు భవిష్యత్తునిచ్చిన మహానేత వైఎస్‌ను వారు దైవంలా భావిస్తున్నారు. కృష్ణమూర్తి తనషాపులో దేవుళ్ల చిత్ర పటాల మధ్య మహానేత చిత్రాన్ని పెట్టి పూజిస్తున్నారు.
తల్లిదండ్రులతో శబరీష్ (ఫైల్)