
ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి
కర్నూలు(సెంట్రల్): పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.6400 కోట్లను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు అఖండ, ఉపాధ్యక్షుడు రమణకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సోమవారం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. పీజీ విద్యార్థులకు ఉరితాడుగా మారిన జీఓ నంబర్ 77ను వెంటనే రద్దు చేయాలన్నారు. తద్వారా ప్రతి విద్యార్థి పీజీ చేయడానికి వెసులుబాటు వస్తుందన్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులను మెరుగుపరచాలని, విద్యార్థులకు ఇచ్చే కాస్మొటిక్, మెస్ చార్జీలను పెంచాలని కోరారు. విద్యారంగ సమస్యలను నిర్లక్ష్యం వహిస్తే పోరాటాలు తప్పవని హెచ్చరించారు. నాయకులు మల్లికార్జున, నరేష్, అస్లాంబాషా, కిరణ్, వీరేష్ పాల్గొన్నారు.