
ఆదిలోనే హంసపాదు!
డోన్: కూటమి నాయకుల ఒత్తిడి మేరకు ఆఘమేఘాల మీద ప్రజాభిష్టాన్ని లెక్కచేయకుండా పట్టణ నడిబొడ్డున ఉన్న సబ్‌రిజిస్ట్రార్ కారాలయాన్ని శివారు ప్రాంతంలోని టీడీపీ నాయకుని షాపింగ్ కాంప్లెక్స్ వద్దకు మార్చడం ఆదిలోనే హంసపాదులా మారింది. గత శుక్రవారం వరకు పోలీసుస్టేషన్ సమీపంలోని పాత సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో స్థిర, చర ఆస్తుల విక్రయాలు జరిగాయి. ఉన్నతాధికారుల ఒత్తిడి తాళలేక రాత్రికి రాత్రే శివారు ప్రాంతంలోని భవనంలోకి కార్యాలయాన్ని మార్చారు. కానీ భవనానికి ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో మరో మూడు, నాలుగు రోజులు క్రయ, విక్రయాలు బందయ్యే అవకాశాలున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడనుంది. మరోవైపు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ రెండంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించిన టీడీపీ నాయకులు ఆ షాపులన్నీ స్టాంప్ వెండర్లు, డాక్యుమెంట్ రైటర్లకు అద్దెకు ఇచ్చారు. షాపులకు కూడా ఇంతవరకు విద్యుత్ మీటర్లు బిగించలేదు. దీంతో చీకట్లోనే పనులు చేసుకోవాల్సి వస్తోందని స్టాంప్ వెండర్లు, డాక్యుమెంట రైటర్లు వాపోతున్నారు.
టీడీపీ నాయకుడి షాపింగ్ కాంప్లెక్స్ వద్దకు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం మార్పు
ఇంటర్నెట్ సౌకర్యం లేక ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు
కాంప్లెక్స్‌కు విద్యుత్ సౌకర్యం లేక చీకట్లో మగ్గుతున్న వెండర్లు, డాక్యుమెంట్ రైటర్లు

ఆదిలోనే హంసపాదు!