
నా ఎదుగుదల వైఎస్సార్ పుణ్యమే
నేను ఒకటవ తరగతి నుంచి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో, ఆరు నుంచి 10వరకు కంబాలపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్నా. 2001–08లో పదో తరగతిలో 510 మార్కులు సాధించా. అప్పుడే కొత్తగా ట్రిపుల్ ఐటీలు ప్రారంభించారు. వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో ఇంటర్, బీటెక్ పూర్తయింది. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చింది. గత ఐదేళ్లుగా నెరోలాక్ పెయింట్స్‌లో ఇంజనీరుగా పనిచేస్తున్నా. ఇదంతా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమే.
– కె.లక్ష్మీకాంతరెడ్డి, బోయబొంతిరాళ్ల
భూమి ఉన్నంత వరకు
వైఎస్సార్ గుర్తుంటారు
హంద్రీనీవా కాలువ ద్వారా రిజర్వాయర్‌లోకి నీరు వస్తుంది. అక్కడి నుంచి మా గ్రామంలోని పొలాలకు నీరు అందుతుంది. ఒక్కప్పుడు నిత్యం కరువుతో అల్లాడుతున్న సమయంలో వైఎస్సార్ దేవుడిలా వచ్చారు. ఎక్కడో ప్రవహించే కృష్ణజలాలు ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంతానికి తీసుకరావడంతో మంచి పంటలు పండించుకుని అప్పుల నుంచి గట్టెక్కాం. ఈ భూమి ఉన్నంత వరకు వైఎస్సార్ ఇక్కడి ప్రజల గుండెల్లో కొలువై ఉంటారు.
– కురువ నాగరాజు, రైతు, పుట్లూరు
రెండు పంటలు పండిస్తున్నాం
సిద్దాపురం చెరువు కింద రెండు పంటలు పండిస్తున్నాం. ఎత్తిపోతల పథకం మంజూరు కాకపోయుంటే కరువు కాటకాలతో ఇబ్బందులు పడేవాళ్లం. ప్రస్తుతం ఎత్తిపోతల పథకంతో సిద్దాపురం చెరువులో పూర్తి స్థాయిలో నీరు ఉంది. ఈ నీటితో రెండో పంటకు కూడా నీరందుతోంది. ఈ పథకం మంజూరు చేసిన దివంగత నేత వైఎస్ రాజశే ఖర్‌రెడ్డిని నిత్యం స్మరించుకుంటున్నాం.
– యేసేబు, ఆత్మకూరు
4 శాతం రిజర్వేషన్‌తో డాక్టర్ అయ్యా
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ దే. ఈ రిజర్వేషన్ మాలాంటి వారికే ఎంతో ఉపయోగపడింది. వైద్యవిద్యను అభ్యసించేందుకు అవకాశం కలిగింది. కుప్పం పీఈఎస్ మెడికల్ కాలేజీలో (ఎమర్జెన్సీ మెడిసిన్), డీఎన్‌బీ విద్యను బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో పూర్తి చేశా. మెడిసిన్ విద్యను పూర్తి చేయడంతోనే నా కల సాకారమైంది. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ వంటి వాటితో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు వైఎస్సార్ అప్పట్లో అమలు చేశారు. ఎంతో మంది సామాన్యుల జీవితాల్లో మార్పు వచ్చి ప్రస్తుతం ఉన్నతంగా జీవిస్తున్నారు. – మహమ్మద్ రఫీ, చాబోలు,
నంద్యాల మండలం
●

నా ఎదుగుదల వైఎస్సార్ పుణ్యమే

నా ఎదుగుదల వైఎస్సార్ పుణ్యమే

నా ఎదుగుదల వైఎస్సార్ పుణ్యమే