
దిగువకు వే‘గంగా’..
ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షం ఒకచోట కురిసి మరో చోట కనిపించడం లేదు. కర్ణాటక రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. టీబీ డ్యాం నుంచి వదిలిన నీరు సుంకేసుల డ్యామ్‌కు భారీగా వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 1.235 టీఎంసీ కాగా పూర్తిస్థాయిలో నిండింది. అయితే వచ్చిన నీటిని కేసీ కెనాల్‌కు, కర్నూలు నగర ప్రజల తాగునీటి అవసరాలకు వదలకుండా దిగువకు వదిలేస్తున్నారు. ఇందుకోసం సుంకేసుల జలాశయం అన్ని గేట్లు ఎత్తేశారు. కేసీ కాల్వకు నీరు వస్తే పంటలు వేసుకోవాలని రైతులు ఎదురు చూస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో సాగుపై ఆశలు వదులుకున్నారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు
సుంకేసుల డ్యామ్ గేట్లు ఎత్తడంతో దిగువకు ప్రవహిస్తున్న వరద నీళ్లు