
అంబులెన్స్ బహూకరణ
మంత్రాలయం రూరల్: శ్రీ రాఘవేంద్ర స్వామి భక్తులు శ్రీ మఠం ఆసుపత్రి అంబులెన్స్‌ను బహూకరించారు. శనివారం స్థానిక మఠం ఆవరణలో అంబులెన్స్‌కు పీఠాధిపతి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు. బెంగళూరు సాఫ్ట్‌వేర్ ఏజీ కంపెనీకి వారి సౌజన్యంతో భక్తులు రవీంద్రనాయక్, కృష్ణ పురోహిత్ శ్రీ మఠం ఆసుపత్రి సుజయేంద్ర ఆరోగ్యశాలకు అంబులెన్స్‌ను అప్పగించారు. భక్తులకు ఫలపూలమాంత్రక్షాంతలతో శ్రీమఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి కో ఆర్డినేటర్ విజేయేంద్ర రావు, మెడికల్ ఆఫీసర్ సుదేంద్ర పాల్గొన్నారు.