
వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
కర్నూలు: డైబ్బె ఏళ్ల వయస్సు పైబడి, అనారోగ్యంతో బాధ పడుతున్న ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తూ త్వరగా బెయిల్ మంజూరయ్యేలా కృషి చేస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి తెలిపారు. శుక్రవారం ఆయన కర్నూలు శివారులోని పురుషుల కేంద్ర కారాగారం, నగరంలోని మహిళా కారాగారాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలు ఖైదీలకు ప్రిజన్ ఎయిడ్ క్లినిక్స్ గురించి వివరించారు. ఇందులో ఒక అడ్వకేట్, ఒక పారా లీగల్ వలంటీర్ ఉంటారని, వారు ఖైదీలకు న్యాయ సలహాలు అందిస్తారన్నారు. ఖైదీలు సత్ప్రవర్తనతో శిక్షను పూర్తి చేయాలని కోరారు. ఖైదీలకు అందించే ఆహారాన్ని, రేషన్, వారి ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100 గురించి అవగాహన కల్పించారు.