
బాబూ.. పింఛన్ ఇవ్వండి!
సహాయకుడి సాయంతో నడుస్తున్న ఈ అవ్వ పేరు వడ్డె పెద్ద పాపమ్మ. నందవరం మండలం గంగవరం గ్రామానికి చెందిన ఈమెకు 77 ఏళ్ల ఉన్నాయి. భర్త వడ్డె పెద్ద రాముడు మృతి చెంది రెండు సంవత్సరాలైనా ఇప్పటి వరకు అవ్వకు పింఛన్ రాలేదు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి శుక్రవారం వస్తున్నారని తెలుసుకుని ఒంటరిగా ఆటోలో తన స్వగ్రామం నుంచి బయలు దేరి ఉదయం 10 గంటలకు నందవరానికి వచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎదురు చూసినా ఎమ్మెల్యే రాలేదు. దీంతో వృద్ధురాలు కన్నీరు పెట్టారు. పింఛన్ రావడం లేదు, బియ్యం కూడా వేయడం లేదని ఆమె విలపించారు. ఎమ్మెల్యే ఆలస్యంగా రావడంతో అప్పటికే వృద్ధురాలు పెద్దపాపమ్మ స్వగ్రామానికి వెళ్లారు.
– నందవరం