● 12 గంటలు.. 23 ఎకరాలు | - | Sakshi
Sakshi News home page

● 12 గంటలు.. 23 ఎకరాలు

Jul 5 2025 6:02 AM | Updated on Jul 5 2025 6:02 AM

● 12 గంటలు.. 23 ఎకరాలు

● 12 గంటలు.. 23 ఎకరాలు

నందికొట్కూరు: పొలంలో అడుగు పెడితే మాకెదురు లేదు.. అంటూ నందికొట్కూరుకు చెందిన ఓ రైతు వృషభాలు రంకేసి చెబుతున్నాయి. 12 గంటల్లో 23 ఎకరాల్లో ఎద్దులతో విత్తనం వేసి ఓ రైతు రికార్డు సృష్టించాడు. పట్టణానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి ఓ రైతుకు చెందిన 25 ఎకరాలను కౌలుకు తీసుకున్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు భూమి పదునెక్కడంతో మొక్కజొన్న విత్తనం వేసేందుకు పట్టణానికి చెందిన రైతు శ్రీను కాడెద్దులతో శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 23 ఎకరాల భూమిని కాడెద్దులతో విత్తనం వేశాడు. విషయం తెలుసుకున్న రైతులు, గ్రామస్తులు ఎద్దులను చూసేందుకు ఆసక్తి చూపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement