
‘కార్పొరేట్’ కోసమే పీపీపీ విధానం
కర్నూలు(టౌన్): కార్పొరేట్ రంగాన్ని పెంచి పోషించేందుకే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పీపీపీ (పబ్లిక్, ప్రెవేటు, పార్టనర్‌షిప్) విధానాన్ని అమలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కటారు కొండ సాయి కుమార్ విమర్శించారు. ఈ విధానంతో రాష్ట్రంలో మెరిట్ ఉన్న పేద, మద్యతరగతి విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి నేతలు ఈనెల 7వ తేదీన విజయవాడలోని ఎన్‌టీఆర్ యూనివర్సీటీలో ఉపకులపతిని కలిసి మెమోరాండం అందజేస్తున్నట్లు స్పష్టం చేశారు. కర్నూలు ఎస్వీ కాంప్లెక్స్‌లో వైస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కటికె గౌతమ్ మాట్లాడుతూ.. అన్ని అర్హతలు ఉన్న యువ వైద్యులు వారి హక్కు అయినా పీఆర్ (పర్మనెంట్ రిజిస్ట్రేషన్)ను అడిగితే పోలీసుల చేత అగౌరవపరిచారన్నారు. విద్యార్థి విభాగం కర్నూలు నగర అధ్యక్షులు అన్సర్ మాట్లాడుతూ విద్యార్థులపై జరుగుతున్న అన్యాయాలను సహించబోమన్నారు. సమావేశంలో విద్యార్థి సంఘం నాయకులు శ్రీకాంత్, కోడుమూరు నియోజకవర్గ నాయకులు శ్రీధర్, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కటారుకొండ సాయికుమార్ వెల్లడి