
వైఎస్సార్‌సీపీ జిల్లా బూత్ కమిటీల నియామకం
కర్నూలు (టౌన్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లావ్యాప్తంగా బూత్ కమిటీల నాయకులను నియమించింది. వైఎస్సార్‌సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా కమిటీలను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. బూత్ కమిటీ ఉపాధ్యక్షులుగా జియం.క్రాంతికిరణ్ (కర్నూలు), వి.అమర్‌నాథ్ రెడ్డి (పత్తికొండ), ప్రధాన కార్యదర్శులుగా రమేష్ (ఆలూరు), జి.పరుశురాముడు (మంత్రాలయం), తులసీ రెడ్డి (కోడుమూరు), సీ.విశ్వనాథ్ (ఆదోని), యం.శివ (కర్నూలు), కె.రమేష్ (ఎమ్మిగనూరు), కార్యదర్శులుగా మోనీ నారాయణ (ఎమ్మిగనూరు), వి.చంద్రశేఖర్ (పత్తికొండ), రామలింగ (ఆలూరు), కె.నాగరాజు (మంత్రాలయం), ఎస్.మారుతి (ఆదోని), ఎ.మహేష్ (కర్నూలు), విద్యాసాగర్ (కోడుమూరు), ఎస్.గఫూర్ (కర్నూలు), కార్యానిర్వహక సభ్యులుగా బి.శివభూషణ రెడ్డి (ఎమ్మిగనూరు), ఏ.రవిశేఖర్ రెడ్డి (పత్తికొండ), నందీష్ (ఆలూరు), యు.రమేష్ (మంత్రాలయం), యం.ఎల్లప్ప (ఆదోని), యంసి.నాగరాజు, ఎస్.నజీర్ (కర్నూలు), రమేష్ (కోడుమూరు) నియమితులయ్యారు.
జిల్లా డాక్టర్ల విభాగం కమిటీ
జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ల కమిటీని నియమించారు. ఉపాధ్యక్షులుగా పి.రంగారెడ్డి (పత్తికొండ), జె.ఈరన్న (మంత్రాలయం), ప్రధాన కార్యదర్శులుగా చంద్రశేఖర్ (ఆలూరు), ఎస్.నరహరి రెడ్డి (ఎమ్మిగనూరు), కార్యదర్శులుగా బండ్ల శివరాముడు (ఎమ్మిగనూరు), సి.జయక్రిష్ణ (పత్తికొండ), క్రిష్ణమూర్తి (ఆలూరు), యం.మహబూబ్‌బాషా ( మంత్రాలయం), కార్యనిర్వహక సభ్యులుగా చెన్నప్ప (ఎమ్మిగనూరు), కె.మనోహర్ ఆచారి (పత్తికొండ), ఎస్.మోహన్ రెడ్డి (ఆలూరు), వి.రాగరాజు (మంత్రాలయం)ను పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.